calender_icon.png 28 December, 2024 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టు లోతట్టు ఆక్రమణలు అపాలి

01-12-2024 05:55:02 PM

గుమ్మడవల్లి రైతుల ఆందోళన

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని పెద్ద వాగు ప్రాజెక్టు లోతట్టు ఆక్రమణలు నివారించాలని డిమాండ్ చేస్తూ, ప్రాజెక్టు నిర్మాణానికి సాగు భూములు ఇచ్చిన  గుమ్మడవల్లి రైతులు ఆదివారం ఉదయం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. లోతట్టులో ఉన్న 1200 ఎకరాల్లో సుమారుగా 1000 ఎకరాలకు పైగా భూమిని చదును చేసి, సాగు చేసేందుకు దుక్కులు దున్ని సిద్ధం చేశారు. లోతట్టు మొత్తం అక్రమించుకోవడంతో పెద్ద వాగు ప్రాజెక్టులో నీరు నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిందని, దీంతో ఆయకట్టు రైతులకు సాగు నీరు పూర్తి స్థాయిలో లభించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, లోతట్టు ఆక్రమణలు తొలిగించేంత వరకు ఆందోళన చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.