calender_icon.png 13 March, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీకి ఒకటి ఇంకుడు గుంత నిర్మాణానికి శ్రీకారం

13-03-2025 04:52:28 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆదేశాలతో టేకులపల్లి మండలంలోని 36 గ్రామపంచాయతీలో గ్రామస్తులు, యూత్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేకించి ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పున  ఇంకుడు గుంత నిర్మాణాలు చేపట్టడం ప్రారంభించారు. తొమ్మిదో మైల్ తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎంపీడీవో గడదాసు రవీంద్రరావు(MPDO Gadadasu Ravindra Rao) ఆధ్వర్యంలో గ్రామస్తులు, యూత్ ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టారు. రాబోయే రోజులలో భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటి ఆవరణలో ఒక ఇంకుడు గుంట నిర్మాణం ఉపాధి హామీ ద్వారా కచ్చితంగా నిర్మించుకోవాలని, ప్రతి రైతు పొలంలో ఫారం పాడు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులను రైతులను కోరడం జరిగింది. వీటి వలన వృధాగా పోయే నీటిని పై నిర్మాణల ద్వారా భూగర్భ జలాలు పైకి తీసుకురావచ్చు అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కాలింగ్ శ్రీనివాస్, కార్యదర్శి కృష్ణకుమారి, క్షేత్ర సహాయకుడు భద్రం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.