calender_icon.png 16 November, 2024 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అల్లుడి కోసం గిరిజనులకు అన్యాయం

16-11-2024 12:48:27 AM

వనపర్తి, నవంబర్ 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తన అల్లుడి లాభం కోసం వికారాబాద్ జిల్లాకు పార్మాసిటీ తీసుకువస్తున్నారని, లగచర్లలో భూములను కాపాడుకునేందుకు నిరసన చేసిన వారిని ఉగ్రవాదుల్లా అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసం నిర్వహించిన మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు పెట్టిన భిక్ష సీఎం పదవి అని, అది మరిచి సీఎం వారిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఫార్మసీ సిటితో గిరిజనుల జీవనాధారం పోయి, గిరిజనుల బతుకు ఛిద్రమవుతుందన్నారు.