calender_icon.png 30 November, 2024 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు పండితులకు అన్యాయం

30-11-2024 12:00:00 AM

తెలంగాణ ప్రభుత్వ నిర్వహించే టెట్ పరీక్షలో తెలుగు, హిందీ, ఉర్దూ పండితుల కోర్సులు పూర్తి చేసిన వారికి అన్యాయం జరుగుతున్నది. సోషల్ వారికి ఉండే కంటెంట్ 60 మార్కులు పండితులకు కూడా పెట్టడం వలన ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారు. పండిత కోర్సులు  చేసిన వారికి సోషల్ సబ్జెక్టుతో సంబంధం ఉండదు. అయినప్పటికీ వారితో సమానంగా 60 మార్కులకు సోషల్  ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. 

ప్రభుత్వం ఆలోచించి తెలుగు పండిత కోర్సులు పూర్తి చేసిన వారి కోసం పేపర్ థర్డ్ అనేదాన్ని ఏర్పాటుచేసి దానిలో కంటెంట్‌కు 90 మార్కులు కేటాయించాలి. సైకాలజీ 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు ఉండేటట్లు నిర్వహిస్తే పండిత కోర్సులు చేసిన వారికి న్యాయం చేసినట్లు అవుతుంది. దయచేసి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి పండిత  కోర్సులు పూర్తి చేసిన వారికి టెట్టు లో న్యాయం చేయగలరని మనవి.

-- తాండ్ర చిరంజీవి, వరంగల్ అర్బన్