- సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం
- నిరసనలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయ క్రాం తి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింద ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ రెడ్డి, టిజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి లు ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్ర హం ముందు దేశ ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు.
తెలంగాణ రాష్ర్టం నుంచి కేంద్రా నికి లక్షల పన్నులు కడుతున్న బడ్జెట్లో అన్యాయం చేశారని ఆరోపించారు. తెలం గాణ రాష్ర్టంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తీసుకు రాకపోవడం బిజెపి ఎంపీల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.
తెలంగాణ ప్రజలకు బిజెపి ఎంపీలు వెంటనే క్షమాపణ చెప్పాల ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయ మన్నారు.
కార్యక్రమంలో టిపిసిసి కార్యద ర్శి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు లు రఘు గౌడ్, సిడిసి చైర్మన్ రాం రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, రామచంద్రనా యక్, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ మోతిలాల్ నాయక్, రవి, కిరణ్‌గౌడ్, సంతోష్ పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాం తి): కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి, నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమ వారం నర్సాపూర్లో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన, ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజక వర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యా లయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు.
నర్సాపూర్ చౌరస్తాలో ప్రధాన మం త్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ..కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో బీహార్ కు, ఢిల్లీకి, బిజెపి పాలిత రాష్ట్రాలకు విధులు కేటాయించి తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యా యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
8 మంది బిజెపి ఎంపీలు రాష్ట్రానికి నిధులు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక జీడిపి, అత్యధిక జీఎస్టి అందిస్తున్న రాష్ర్టం తెలంగాణ రాష్ర్టం అని తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారికి తెలంగాణపై ప్రేమ ఉంటే, తెలం గాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
వెంటనే వారు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ జడ్పీటీసీ శ్రీనివా స్ గుప్త, మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి, మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురా లు భవాని, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, మండల అధ్యక్షులు మల్లేష్, శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.