- ఢిల్లీ, బీహార్ ఎన్నికలు తప్ప వెనకబడ్డ తెలంగాణ కనిపించడం లేదు.
- విభజన హామీలు కూడా అమలు చేయకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు
- పార్లమెంట్లో బిజెపి ఎంపీలు గొంతు వినిపించాలి
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు భువనగిరి ప్రెస్ మీట్ లో గాడిద గుడ్డు ఫ్లెక్సీలను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 2 ( విజయ కాంతి): బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించక గాడిది గుడ్డు మాత్రమే ఇచ్చిందని. విభజన హామీలు కూడా అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని భువనగిరి పార్ల మెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
బిజెపి రాష్ట్రాల పై ఉన్న ప్రేమ తెలంగాణపై కేంద్రానికి లేదని. మోడీ ప్రధాని అయిన నాటినుండి అన్యాయం చేస్తూనే ఉన్నాడని ఎంపీ ఆరోపించారు. నీళ్ళు, నిధులు నియామకాలతో సాధించుకున్న తెలం గాణకు కేంద్రం నిధుల కేటాయించడంలో వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో నుంచి బిజెపి అధికారంలో ఉండిగా రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉండి కెసిఆర్ నియంత పోకడతో నరేంద్ర మోడీకి ఏనాడు కూడా ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి నీ స్వీకరించలేదన్నారు.
మ్యాచింగ్ గ్రాంట్స్ 40 శాతం తెలంగాణ పెడితే 60 కేంద్రం ఇవ్వాల్సిన వాటాలో మనకు ఎంత ఇచ్చారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ లకు, పేరుకే మున్సిపాలిటీలుగా మార్చుకున్నం కానీ కేంద్రం నుండి ఎలాంటి గ్రాంట్స్ మంజూరు చేయలేదు. 10 సంవత్సరాల నుండి కేసీఆర్ కు మోడీకి సఖ్యత లేకపోవడమేనని ఎంపీ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు నిధుల మంజూరు కొరకు ఎన్నోసార్లు ప్రధానమంత్రిని మంత్రులను కలిశారు. అయినా నిధులు కేటాయించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతూ వెనుకబడి తెలంగాణకు మాత్రం బడ్జెట్లో చోటు కల్పించక పక్షపాతం చూపిస్తుందని ఆరోపించారు.
చిన్న రాష్ట్రం ఐన తెలంగాణ రాష్ట్రం నుండి 5 పర్సెంట్ జీడీపీ వరకు వచ్చిన కూడా కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాలేదు. కేంద్రానికి డిల్లీ బీహార్ ఎన్నికలు కనిపిస్తునాయి తప్ప తెలంగాణ రాష్ట్రం కనిపించడం లేదా అన్నారు. లక్ష అరవై మూడు కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసం అడిగిన నిధులు కేటాయించలేదు. మూసి ప్రక్షాళన కోసం అడిగిన ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం శోచనీయం.
తెలంగాణకు అన్యాయం జరిగిందని కోడైకొస్తున్న బిజెపి ఎంపీలకు అర్థం కావడం లేదా అని అన్నారు. తెలంగాణకు 50 కోట్ల లక్షల నిధులలో బిజెపి ఎంపీలు ఎంత తీసుకొస్తారో తెలియజేయాలి అని ఎంపీ చామల కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బ్రహ్మాండమైన బడ్జెట్ అంటునారు వారికి బడ్జెట్‌లో తెలంగాణాకు జరిగిన అన్యా యం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
మనకు రావాల్సిన నిధులను డాక్యుమెంట్‌లో విడుదల చేస్తాం. తెలంగాణ గురించి ఒక నిమిషం కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడ కపోవడం బాధాకరం. టికెట్ల నియంత్రణ చేయలేనప్పుడు కోట్ల రూపాయలు పెట్టీ విమాన శ్రయలు నిర్మించడం దేనికని ప్రశ్నించారు. 10 సంవత్సరాల నుండి జరిగిన అన్యాయం మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది బీజేపీ ఎంపీ లు తెలంగాణ తరుపున గళం ఎత్తాల్సిన అవసరం ఉంది.
8 ఎంపీ లని గెలిపించిన తెలంగాణ ప్రజల తరుపున నియంత పాలన నుండి విముక్తి కోరిన ప్రజల తరపున మాట్లాడాల్సిన అవసరం ఉంది. రైతు రుణ మాఫీ చేసాం ఇంకా కూడా ప్రజల కోసం అనేక విధాలుగా ప్రజలకు మేము అండగా ఉంటామని ఎంపీ చామల ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.