calender_icon.png 16 January, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్ఫేర్ కమిటీలతో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం

11-09-2024 01:13:19 AM

ఆర్టీసీ యూనియన్ నేత కొమిరెల్లి రాజిరెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఆర్టీసీలో యూని యన్లను అనుమతిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూ (ఐఎన్‌టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి తెలిపారు. రూపా యి ఖర్చు లేకుండా పరిష్కారమ య్యే  ఈ సమస్య పట్ల రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించకుండా, వెల్ఫేర్ కమిటీల ఏర్పాటుకు ఈ నెల 2న బస్ భవన్ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. తక్షణమే ఈ వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు మేరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వేతన సవరణ బాండ్లను డ్రైవర్లకు మాత్రమే చెల్లించి మిగతా కార్మికులను అన్యాయం చేశారని వాపోయారు. విలీన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకునాలని కోరారు.