calender_icon.png 31 October, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాధనం అప్పనంగా కట్టబెట్టారు

15-07-2024 12:24:41 PM

హైదరాబాద్: హనుమకొండ కలెక్టరేట్ లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రైతుభరోసా విధివిధానాలపై భట్టి విక్రమార్క చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సమీక్షకు వరంగల్ ఉమ్మడి జిల్లాల రైతు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.... బీఆర్ఎస్ హయాంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. గతంలో రైతులకు నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేదని తెలిపారు. వందల ఎకరాలు ఉన్న వారికి ప్రజాధనం అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. విదేశాలకు వెళ్లిన వారికి కూడా డబ్బులు అందాయని విమర్శించారు. గతంలో నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకని అమలు చేశారని పేర్కొన్నారు. రైతుబంధును రైతుభరోసాగా మారుస్తూ అమలు చేస్తున్నామని సూచించారు. రైతు భరోసాపై నిపుణులు, ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తున్నామన్నారు. అభిప్రాయాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.