calender_icon.png 28 March, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం

22-03-2025 12:23:10 AM

పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు మహేష్

హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు పి.మహేష్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు పి.మహేష్, రాష్ట్ర, అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌వి. శ్రీకాంత్, పొడపంగి నాగరాజులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి మాట తప్పిందన్నారు.

ధ్వంసమైన విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి కనీసం 20% నిధులు కేటాయించాలని బడ్జెట్ కు ముందే మేధావులు విద్యావేత్తలు విద్యార్థి సంఘాలు కోరినా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. బడ్జెట్ లో కేవలం  7.57శాతం నిధులు కేటాయించిందని అన్నారు.  ఆ కేటాయింపులు ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవన్నారు. ప్రభుత్వ విద్యాలయాలు కనీస వసతులు లేక కూ,ప్రభుత్వ యూనివర్సిటీలు కనీస సదుపాయాలు లేక విలవిలలాడుతున్నాయన్నారు.  వీటికి ప్రత్యేకమైన గ్రాంట్లు విడుదల చేయాల్సిన రాష్ర్ట ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. 8 వేలకోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయని, పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఆర్థిక భారంతో చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ర్ట నాయకులు బోనగిరి మధు, పి.కిరణ్,  జె.రాజేశ్వర్, సంతోష్. జీ. మస్తాన్,కె.శ్రీనివాస్,ఎం.ప్రవీణ్.  రాణా ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.