calender_icon.png 3 February, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం

03-02-2025 01:10:34 AM

ఓయూలో బడ్జెట్ ప్రతులు చింపేసి నిరసన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్ వాపోయారు. రూ.50,65,345 కోట్ల బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.2,500 కోట్లే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీన్ని నిరసిస్తూ ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేంద్ర బడ్జెట్ ప్రతులను చించేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ బీసీ సామాజికవర్గానికి చెందిన మోదీ ప్రధానిగా ఉన్నప్పటికీ బీసీలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కార్యక్ర మంలో విద్యార్థి సంఘాల నాయకులు నామ సైదులు, విజయ్‌నాయక్, సురేశ్‌నాయక్, యాకు నాయక్, చంద్రకాంత్ తదితరులుపాల్గొన్నారు.