calender_icon.png 24 February, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు సర్వేతో బీసీలకు తీరని అన్యాయం

19-02-2025 01:08:34 AM

కులగణనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు 

తప్పు చేశారు కనుకనే మళ్లీ సర్వే 

రేవంత్‌కు గుణపాఠం ఖాయం 

టీడీపీ, బీఆర్‌ఎస్‌లో సామాజిక న్యాయం శూన్యం 

మీడియాతో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ 

ఖమ్మం, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) :- తప్పుడు సర్వేలతో బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి తగిన గుణపాఠం  తప్పదని బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభు త్వంపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్ని కల ప్రచారంలో భాగంగా మంగళవారం ఖమ్మం వచ్చి ఆయన మీడియాతో మాట్లా డారు. చిత్తశుద్ధిలేని కుల గణన చేసి రేవంత్ డ్రామాలాడుతున్నారని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని బీసీలు గ్రహించారని, అందుకే రేవంత్ ప్రభుత్వం మళ్లీ రెండోసారి కుల గణన చేస్తుందని పేర్కొన్నారు.

చట్టబద్ధత లేని కులగణన వల్ల ఎటువంటి ప్రయోజ నం లేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి  ఏ మాత్రం చిత్తశుద్ధి,  నిజాయితీ ఉన్నా కులగణను శాస్త్రీయంగా చేసి ఉండేదని అన్నారు. అది లోపించడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలకు గురైందని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ నిజాయితీగా చిత్తశుద్ధితో శాస్త్రీయంగా కుల గణన చేప ట్టాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో మాదిరిగా చట్టబద్ధ కమిటీని ఏర్పాటు చేసి కుల గణన చేపట్టాలని కోరారు.ప్రభుత్వం కావాలనే బీసీ జనాభాను తక్కువ చేసి చూపించిందని ధ్వజమెత్తారు.

తెలంగాణా రాష్ర్ట జనాభా 2025 నాటికి  నాలుగున్నర కోట్లకు చేరుకుందని, ఈ క్రమంలో  బీసీ జనాభా గణనీయంగా పెరగగా ఎందుకు తక్కువ చేసి చూపించారని ప్రశ్నించారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నైనా సీఎంగా చేశారా అని ని లదీశారు. కాంగ్రెస్ ది కుటుంబ పాలన అని, అక్కడ వేరే కులానికి ఆస్కారం లేదని అన్నారు. రేవంత్ మోదీ కులాన్ని ప్రస్తావించడం అవివేకం అన్నారు. దేశం లోనే మోదీ సకల వర్గాలు, కులాలు, మతా ల ముద్దు బిడ్డ అని కొనియాడారు. మోదీని విమర్శించే నైతికత రేవంత్‌కు లేదన్నారు.

టిడిపి, బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీలో కూడా కుటుంబ సభ్యుల ఆధిపత్యం పరి స్థితే నెలకొందని,  ఆ కుటుంబ సభ్యులే ప్రధాన పాత్ర పోషించారని, రెండో కులా నికి అవకాశం లేకుండా చేశారని చెప్పారు. ఆ పార్టీల్లో సామాజిక న్యాయం శూన్యమని ఫైర్ అయ్యారు. ప్రాంతీయ పార్టీలో సామాజిక న్యాయం ఆశించడం ఒట్టి మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. కులగణన అనేది ఎవరు కాదనలేని సత్యం అని, దేశంలో కులాన్ని విస్మరించలేం అని చెప్పారు.ఇప్పటికైనా సీఎం రేవంత్ సోయి తీసుకొని  శాస్త్రీయంగా సర్వే జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మూడు ఎమ్మెల్సీలు మావే..

రాష్ర్టంలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి చెందిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు గతంలో గెలిచిన వారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. అందుకే ఈసారి అధికార పార్టీ చెప్పే అబద్దపు ప్రచారం నమ్మకుండా బిజెపి అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు ఎదురుచూస్తున్నారని పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ 317 జిఓ సవరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం దని అన్నారు. ఇంతవరకు ఆ జీవో గురించి పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. సిపిఎస్ విషయంలో కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపా రు. సమావేశంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.