- 11 నెలల పాలనలో అభివృద్ధి దూరం
- ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
సంక్షేమ గురుకుల పాఠశాలల మెస్, అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో భవన యజమానులు తాళాలు వేస్తే 9 నెలలకు గాను కేవలం 3 నెలల బిల్లులను మాత్రమే ప్రభుత్వం చెల్లించిందని ఎక్స్ వేదికగా శుక్రవారం దుయ్యబట్టారు. 11 నెలల పాలనలో సంక్షేమ గురుకులాల నిర్వహణ గాలికి వదిలేశారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లను చేపట్టడం లేదని రైతులు ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో సంక్షేమంమాయమైందని, అభివృద్ధి దూరమైందని విమర్శించారు.