calender_icon.png 23 December, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాది పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం

22-12-2024 10:42:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు క్యాలెండర్ల పేరుతో మోసం చేసి అధికారులకు వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉపాధ్యక్షులు రిజ్వాన్ అన్నారు. ఆదివారం నిర్మల్ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ కాలేదని పెన్షన్ పెంచిన దాఖలు లేవని ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. హామీల అమలు కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ప్రతిఫలంతో కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతులు నొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా నెరవేర్చుకుంటారు. ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన కోరారు.