దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు దూరం
ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ పోటీలకు దూరం కానున్నాడు. ఇటీవలే ముంబై వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నీలో తమిళనాడు క్రికెట్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో సూర్య చేతి వేలికి గాయమైంది. దీంతో అతను బ్యాటింగ్‌కు రాలేదు. గాయం ఇంకా మానకపోవడంతో ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రిపోర్ట్ చేసినట్లు బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి.
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా టీమ్‌లో ఉన్న సూర్య అనంతపురం వేదికగా ఇండియాడితో జరగనున్న తొలి రౌండ్ మ్యాచ్‌కు సూర్య దూరమయ్యాడు. అదే సమయంలో చెన్నైలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా ఇండియా తలపడన్నుయి. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో జట్టుకు ఎంపికవ్వాలంటే దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందేనంటూ బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు మాత్రం ఈ టోర్నీ నుంచి మినహాయింపు కల్పించారు.