మహబూబాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): విద్యుత్ తీగలు తెగిపడి మహిళకు తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా గం గారంలో బుధవారం జరిగింది. గం గారంలోని అంగన్వాడీ కేంద్రంలో ని తన మనువళ్ల కోసం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయం లో సారక్క అనే మహిళ వెళ్లింది.
ఆ సమయంలో పైన ఉన్న విద్యుత్ తీగలపై పక్షులు వాలడంతో షార్ట్ స ర్కూట్ కారణంగా తీగ తెగి సారక్క మీద పడింది. తీవ్రంగా గాయపడిన సారక్కను స్థానికులు వెంటనే నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.