న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో గురువారం నాడు కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పోటాపోటీ నిరసనలు చేలరేగాయి. పార్లమెంటు వద్ద పోటాపోటీ నిరసనల్లో ఇద్దరు ఎంపీలకు గాయాలయ్యాయి. ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్ పుత్ కు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు ఎంపీలకు రామ్ మనోహర్ లోహియా ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు ఎంపీలకు తలకు దెబ్బలు తగిలాయని ఆర్ఎంఎల్ వైద్యులు వెల్లడించారు. ప్రతాప్ సారంగికి తీవ్ర రక్తస్రావం జరిగి, తలకు లోతైన గాయమైందని వైద్యులు వెల్లడించారు. ప్రతాప్ సారంగి తలకు కుట్లు వేశామని చెప్పారు. ముకేశ్ రాజ్ పుత్ స్పృహ కోల్పోయిన స్థితికి వచ్చారని, వైద్యుం అందించాక స్పృహలోకి వచ్చారని వైద్యలు తెలిపారు.
గురువారంనాడు పార్లమెంట్ ముందు విపక్ష ఎంపీల నిరసన హోరెత్తాయి. బ్లూ కలర్ దుస్తుల్లో పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్ పార్టీయే అంటూ బీజేపీ ఎంపీల నినాదాలు చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.