calender_icon.png 21 March, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందీ భాష అభివృద్ధికి చొరవ తీసుకోవాలి

21-03-2025 12:33:03 AM

ముషీరాబాద్, మార్చి 20: (విజయక్రాంతి) : తెలుగు రాష్ట్రాల్లో హిందీ భాష అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని హిందీ ప్రచార సభ హైదరాబాద్ విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు హిందీ ప్రచార సభ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఎస్. గైబువల్లి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్మోహన్ నాయు డు, రాజ్యసభ సభ్యుడు ఆర్,కృష్ణయ్య తదితరులను వేరువేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు.

తెలుగు రాష్ట్రాల్లో హిందీ భాషాభివృద్దికి గాను పాఠశాల స్థాయి నుంచి హిందీ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని, కోరారు. మే మాసంలో నిర్వహించనున్న హిందీ ప్రచార సభ హైదరా బాద్ 90వ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ చంద్రదేవ్ కావ్డే , కన్వీనర్ శృతికాంత్ భారతి, న్యాయ సలహాదారుడు జె. వెంకట రామ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.