తొలిదశ ఉద్యమకారుల హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24(విజయక్రాంతి): తొలిదశ తెలగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలు విస్మరిస్తే నిరహారదీక్ష చేపడతామని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే జీఎస్ మాథ్యూస్ ప్రకటించారు. కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్‌లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము తెలంగాణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశామని, కానీ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇంటిస్థలం ఇస్తామని, వారి సమస్యలు పరష్కరిస్తామని వాగ్దానం చేసిందని, వాటిని నెరవేర్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో తొలిదశ ఉద్యమకారులు జయరాజ్, రాంచందర్, గౌస్, లక్ష్మీనారాయణ, కామేశ్వరరావు, యాదగిరి పాల్గొన్నారు.