calender_icon.png 18 January, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఆర్ సిబ్బందికి మొబైలైజేషన్ కార్యక్రమం ప్రారంభం

17-01-2025 06:47:19 PM

పోలీస్ శాఖలో విధులను నిర్వర్తించే ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని కలిగి ఉండాలి

డిఎస్పీ రెహమాన్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఏఆర్ సిబ్బందికి మొబైలైజేషన్ పరేడ్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) ఆదేశాల మేరకు ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి రెహమాన్(Kothagudem DSP Rahman) పాల్గొన్నారు. ఈ రోజు నుండి 15 రోజుల పాటు జరిగే ఈ మొబైలైజేషన్ కార్యక్రమంలో పోలీసు శాఖలో కాలానుగుణంగా అనుసరిస్తున్న శిక్షణను ఏఆర్ సిబ్బందికి అందించనున్నారు. పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢత్వం కలిగి ఉన్నప్పుడే బాధ్యతాయతమైన విధులను క్రమశిక్షణతో నిర్వర్తించగలుగుతారని డిఎస్పీ రెహమాన్ ఈ సందర్బంగా అన్నారు.

పోలీస్ శాఖలో క్రమశిక్షణ అనేది చాలా కీలకమని అందుకు అనుగుణంగా అందరూ భాద్యతగా పనిచేయాలని తెలిపారు. రిఫ్రెష్ కోర్స్ లాంటి మొబైలైజేషన్ ఆర్మడ్ రిజర్వ్ సిబ్బందికి చాలా కీలకమని అన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను మర్చిపోకుండా ఉండటంతో పాటు శారీరకంగా దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని తెలిపారు. పదిహేను రోజుల పాటు ఉత్సాహంగా పాల్గొని గతంలో శిక్షణలో పొందిన మెళుకువలను నివృత్తి చేసుకుంటూ ఇండోర్, ఔట్డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్ లో ఉత్తమ ప్రతిభ చూపాలన్నారు. నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత, కుటుంబపరమైన, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు. ఈ శిక్షణాకాలంలో ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, ఎంటిఓ సుధాకర్, హోంగార్డ్స్ ఆర్ఐ నరసింహారావు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.