- రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి
- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ర్ట వ్యాప్తంగా ఈనెల 29వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో తానూ పాల్గొంటున్నట్లు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష స్వరాష్ర్ట సాధనకు బలమైన పునాదులు వేసిందన్నా రు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రిలో చేరుతుం టే.. సీఎం రేవంత్ మాత్రం మహిళలను కోటీశ్వరులను చేస్తానని ప్రగల్బాలు ప లుకుతున్నాడని ఎద్దేవా చేశారు.
మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కు ప్రభుత్వం నాణ్యమైన భోజనం అం దించలేకపోతోందని విమర్శించారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు మరణించినా.. సరైన చర్యలు తీ సుకోకుండా పిట్టలదొర మాటలు చెబుతున్నాడంటూ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఆసుపత్రులలో, రైతులు జైళ్లలో, నిరుద్యోగులు రోడ్లపై ఆందోళనలో ఉన్నార ని.. జాగో తెలంగాణ అంటూ నినదించారు. మహబూ బాబాద్‌లో ఎన్నికలు లేకున్నా పోలీసులు ఎందుకు లాంగ్‌మార్చ్ నిర్వహి స్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామం టే అవకాశం ఇవ్వక పోవడం ప్రజాపాలన ఎట్లా అవుతుంది? ఇది ముమ్మాటి కి నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల, కక్షల, ఆంక్షల, రాక్షస పాలన అంటూ విరుచుకుపడ్డారు.
ఘనంగా నిర్వహిస్తాం: గంగుల కమలాకర్
కరీంనగర్, నవంబర్ 21 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో ఈ నెల 29న దీక్షాదివస్ కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహిస్తామని ఎమ్మెల్యే గంగుల క మలాకర్ అన్నారు. గురువారం మేయ ర్ సునీల్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు హరిశంకర్, కార్పొరేటర్లతో కలిసి సుభాష్‌నగర్, అల్గునూరు ప్రాంతాల్లో దీక్షాది వస్ సభ కోసం స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడు తూ.. దీక్షాదివస్ కార్యక్రమాన్ని కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళలతో గొప్పగా నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట కార్పొ రేటర్లు శ్రీనివాస్, పద్మకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.