14-02-2025 01:42:47 AM
* వరుసగా ఏడో రోజూ నష్టాల్లోనే
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. దేశీయంగా రిటై ల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ఈ ఉద యం సూచీలు రాణించాయి. వరుస నష్టాల నుంచి ఊరట లభించందనుకుంటున్న తరుణంలో గురువారం ఎఫ్‌అండ్‌ఓ వీక్లీ ఎక్స్‌పై రీ ఉండడం, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మళ్లీ సూచీలు వెనక్కి మళ్లాయి.
దీంతో వరుసగా ఏడో రోజూ సూచీలు నష్టాలకే పరిమితం అయ్యాయి. సెన్సెక్స్ ఉద యం 76,201.10 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,171.08) వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో దాదాపు 600 పాయింట్ల మేర లాభపడి 76,764.53 వద్ద గరిష్ఠాన్ని తాకింది.
ఆఖర్లో మళ్లీ అమ్మకాల ఒత్తిడి కారణంగా 32.11 పాయింట్ల నష్టంతో 76,138.97 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 13.85 పాయింట్ల నష్టంతో 23,031.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, ఎస్‌బ్బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, జొమాటో షేర్లు లాభపడ్డాయి.