- ఎక్కించలేదని రైతు ఆత్మహత్యాయత్నం
- రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘటన
కామారెడ్డి, ఆగస్టు27(విజయక్రాంతి): వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరు ఎ క్కించడం లేదని ఓ రైతు తహసీల్దార్ కార్యా లయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మ హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జి ల్లాలోని రామారెడ్డిలో చోటు చేసుకుంది. రా మారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్(55) తన తం డ్రి మంత్రి మొగులయ్య పేరున ఉన్న సర్వేనెంబర్ 856/68లో ఉన్న ఒక ఎకరం భూ మిని వారసత్వం కింద తన పేరున చేయాలని రామారెడ్డి తహశీల్దార్ కార్యాలయ అధి కారుకు అర్జీలు పెట్టుకున్నారు. అధికారులు ఎన్నో రోజుల తిప్పించుకుంటూ తన పేరు ను రికార్డులో చేర్చడం లేదని మనస్థాపానికి గురయ్యాడు.
ఈక్రమంలో తహసీల్దార్ ఆఫీసులో పురుగు మందు తాగి ఆత్మహత్య చే సుకోవడానికి ప్రయత్నించాడు. స్థా నికులు భగవాన్‌ను అడ్డుకున్నా రు. ఈ ఘ టనపై పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫి ర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యయత్నా నికి యత్నించిన భగవాన్‌కు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ విషయంపై తహసీల్దార్ సువర్ణను వివరణ కోరగా గతంలో ఉ న్నవారు తప్పు చేసి ఉండవచ్చన్నారు. తాను గత వారంరోజుల క్రితం వచ్చి రామారెడ్డిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు.