15-03-2025 07:46:35 PM
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం..
పాల్వంచ (విజయక్రాంతి): జిల్లాలోని పలు మండలాల్లో వలస వచ్చిన వలస ఆదివాసి గిరిజనుల ఆవాస ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు. శనివారం పాల్వంచ మండలం రేగుల గూడెం గ్రామపంచాయతీ రాళ్ల చెలక సిపిఐ గ్రామ శాఖ మహాసభ మడకం లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వలస ఆదివాసులకు కనీస వసతులు మంచినీళ్లు రోడ్లు విద్యుత్ విద్యా వైద్యం మౌలిక వసతులు కలిప్పించడంలో ప్రభుత్వ ఐటిడిఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
ఫారెస్ట్ అధికారులు పోడు భూములుకు పట్టాలు ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయించి వలస ఆదివాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం నూతన గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు శాఖ కార్యదర్శిగా మడకం లక్ష్మయ్య సహాయ కార్యదర్శిగా మడకం జోగయ్య 9 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ శాఖ సమావేశంలో పాల్గొన్న నాయకులు సిపిఐ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఇట్టి వెంకట్రావు, సిపిఐ మండల నాయకులు నిమ్మల రాంబాబు, రైతు సంఘం మండల అధ్యక్షులు కొంగర అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, మండల నాయకులు నిట్ట అమృతరావ్, తదితరులు పాల్గొన్నారు