05-04-2025 12:30:18 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. ఏప్రిల్ 4(విజయక్రాంతి) : వరి కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో ఐ కేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల నిధుల ను కేటాయించి రైతులు పండించిన ధా న్యాన్ని మద్దతు ధర తో కొనుగోలు చేస్తుందని, గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా సన్నాలకు 500 బోనస్ ఇస్తోందన్నారు. కేంద్రాలలో దొడ్డు రకం, సన్న రకం వడ్లను కొనేందుకు వేర్వేరుగా కౌంటర్ల ను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కూడా వేర్వేరు రిజిస్టర్ల లో నమోదు చేయాలన్నా రు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కి అవసరమైన ఫ్లెక్సీ లు, తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, అవసరమైనన్ని గన్ని బస్తాలు, టార్ఫా లిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ట్యాబ్, రిజిస్టర్ల నిర్వహణ సక్ర మంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
కేం ద్రాలకు రైతులు పండించిన ధాన్యాన్ని ఎలా తీసుకు రావాలో వ్యవసాయ శాఖ అధికారులు చూసుకుంటారని, కేంద్రాలలో మా త్రం ఎలాంటి పొరపాట్లు జరగ కుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మొగులప్ప, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, ఐకెపి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.