calender_icon.png 1 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యల పరిష్కరించండి

01-03-2025 06:52:19 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ నిధులను పెంచాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు వెంకటేష్(PDSU District President Venkatesh) ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శనివారం నిర్మల్ లో వెంకటేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ బడ్జెట్లో 15% నిధులు కేటాయించినప్పటికీ విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడం వల్ల పాఠశాలలో విద్యార్థులకు వసతులు లేక ఇబ్బందికి పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ రాజు నరేష్ పాల్గొన్నారు.