ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్ పల్లి జనవరి 28 (విజయక్రాంతి) : శ్మశానవాటికలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని చరబండ రాజు కాలనీ, వినాయక నగర్ కాలనీలో ఉన్న శ్మశానవాటికలను డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
మనిషి చివరి మజిలీ అయిన శ్మశానవాటికలో సదుపాయాలు లేకపోవ డంతో అధికారులపై మండిపడ్డారు. వీలైనంత త్వరగా శ్మశానవాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించి, నీటి సదుపాయం కల్పించి మూత్రశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా వినాయక నగర్ లోని స్మశాన వాటికను పరిశీలించిన అనంతరం అక్కడ మౌలిక వసతులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాలానగర్ లోని నాలా పరిసర ప్రాంతాల కాలనీలు, బస్తీలలో దోమలు విజృంభిస్తున్నాయని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకొని ఫాగింగ్ క్రమం తప్పకుండా చేయాలని కోరారు.