calender_icon.png 26 February, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గంలోని అన్ని మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి..

25-02-2025 10:28:20 PM

ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రంజాన్ పర్వదినం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని రంజాన్ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... ముషీరాబాద్ నియోజకవర్గంలోని మసీదుల వద్ద తాగునీరు పరిసరాల పరిశుభ్రతతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలన్నారు.

మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సర్కిల్- 15 డిఎంసి  రామానుజులు రెడ్డి ఏ ఎంహెచ్ఓ ప్రవీణ జిహెచ్ఎంసి డీఈలు సన్నీ, గీత, జలమండలి డీజిఎంలు కార్తీక్ రెడ్డి, రవీందర్, వివిధ శాఖల అధికారులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్కిల్ 15 డిఎంసి రామానుజులు రెడ్డిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు.