క్వీన్స్‌లాండ్ పర్యటనలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ బృందం
బ్రిస్బేన్ : తెలంగాణ స్పోర్ట్స్ యునివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ స్పో ర్ట్స్ అథారిటీ బృందం క్వీన్స్‌లాండ్ పర్యటనకు వెళ్లింది. రెండో రోజు క్వీన్స్‌లాండ్ క్రీడా మంత్రి, అకాడమీ ఇన్‌చార్జీతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు అథెట్లకు మౌలిక వసతులు, సదుపాయాలపై చర్చించారు. అనంతరం క్వీన్స్ లాండ్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించారు. క్వీన్స్‌లాండ్ స్పోర్ట్స్ అకాడమీలో మౌలిక వసతులు, సదుపాయాలు భేష్‌గా ఉన్నాయని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్ర మంలో అధికారులు జయేశ్ రంజన్, సోనీ బాలాదేవి పాల్గొన్నారు.