calender_icon.png 31 January, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహాల్లో మౌలిక వసతులు

29-01-2025 01:20:34 AM

వికారాబాద్, జనవరి -28: జిల్లాలో ఉండే  అన్ని వసతి గృహాలలో  మౌళిక సదుపాయాలు కలిపించి  మంచి వాతావరణములో విద్యార్థులు చదువుకునే ఆవకాశం కలిపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారo కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నందు  ఎస్సి, బిసి, గిరిజన సంక్షేమ అధికారులు, వసతి గృహాల వార్డెన్లతో ఏర్పాటు చేసిన సమావేశములో అయన మాట్లాడుతూ జిల్లా లో ఉండే అన్ని  వసతి గృహాలకు  ఇప్పటికే మొదటి విడత గా  మంజూరు చేసిన నిదులతో వసతి గృహాలలో  రిపిర్ పనులు పూర్తి చేశామన్నారు. 

పనులకు సంబంధించిన   ప్రతి హాస్టల్ లో రూప్  లీకేజీ,  టై లెట్స్ , రన్నింగ్ వాటర్,  కిటికీలు, తలుపులు,  తాగునీటికి ఆర్ ఓ ప్లాంట్స్  అన్ని  మౌలిక సదుపాయాల  ఏర్పాట్ల పై మండలం వారిగా పూర్తి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ (స్తానిక సమస్టలు ) సుదీర్,  ట్రిని కలెక్టర్ ఉమాహరతి, డిఆర్‌డిఏ శ్రినివాస్, సాంఘీక సంక్షేమ అభివ్రుది అధికారి మల్లేశం, బి సి సంక్షేమ అధికారి ఉపేందర్, గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్ రెడ్డి, పంచాయతి రాజ్ డిప్యూటీ ఇంజనీర్లు  మాధవ రెడ్డి, శ్రినివాస్, నాగ భూషణం, ఎస్సి, బి, సి, గిరిజన వసతి గృహాల వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.