ప్రారంభించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య...
ఇల్లందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో గల నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో టేకులపల్లి మండలంలో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. మండల పరిధిలోని తడికలపూడి మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, ప్రాధమిక ఉన్నత పాఠశాలలకు ప్రహరిగోడ, వాష్ రూమ్స్ నిర్మించారు. వాటిని శుక్రవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సుజాత మాట్లాడుతూ... పాఠశాల అభివృద్ధికి మౌలిక సదుపాయములు కల్పించడంలో నవ లిమిటెడ్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. జనరల్ మేనేజర్ సిఎస్ఆర్ఎం జిఎం ప్రసాద్ మాట్లాడుతూ... ఆరోగ్యం, విద్య, జీవనోపాదుల కార్యక్రమాలను వివరించారు.
ముఖ్య అతిథి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ... సమాజాభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. గత నాలుగు దశాబ్దాలుగా పలు ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్న విద్యా కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థితిని అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి డీజీఎం శ్రీహరి రెడ్డి, ఎన్ ప్రసాద్, లైసెన్ ఆఫీసర్ ఖాదరేంద్రబాబు, ఎన్. శ్రీనివాసరావు సివిల్ ఇంజనీర్, అశోక్,కృష్ణారావు, ప్రభుత్వ అధికారుల, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.