18-03-2025 06:53:10 PM
నెమ్మాది వెంకటేశ్వర్లు...
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు..
పెన్ పహాడ్: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో తహాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో దీక్షా చేసీ అనంతరం స్థానిక రెవిన్యూ అధికారి రంజిత్ రెడ్డికి విన్నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని, ఎండిపోయిన వరి పొలాలను నష్ట పరిహారంగా రూ. 30 వేలు ఎకరానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామీణ అంతర్గత రోడ్లు నిర్మాణం లేక బస్సులు నడిచె పరిస్థితి లేదు అన్నారు. గుంపుల తిరుమలగిరి - భక్తాళాపురం - నేల మర్రి, గాజుల మల్కాపురం వరకు బిటి రోడ్డు నిర్మాణం కోసం 3 కోట్ల 70 లక్షల వరకు నిధులు మంజూరు చేసీ నేటికీ మూడు ఏండ్లు దాటిన కూడ పనులు ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటి సభ్యులు ధని యాకుల శ్రీకాంత్, వీర బోయిన రవి, రణపంగి కృష్ణ, మడ్డి అంజిబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.