calender_icon.png 24 February, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగలించింది

18-02-2025 11:05:41 PM

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఆరోపణలు..

న్యూయార్క్: ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ బిజినెస్ రహస్యాలను దొంగలించిదంటూ మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ సంచలన ఆరోపణలు చేసింది. తమ సంస్థ నుంచి కీలక సమాచారాన్ని ఎత్తుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ ప్రయత్నం చేసిందంటూ కాగ్నిజెంట్ విమర్శలు గుప్పించింది. కొంతకాలంగా ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రెజెట్టో నుంచి వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగతనం చేసిందంటూ కాగ్నిజెంట్ 2024 ఆగస్టులో అమెరికా కోర్టులో దావా వేసింది.

అప్పటి నుంచి ఇరు సంస్థలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్ ద్వారా హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రెజెట్టో నుంచి బిజినెస్‌కు సంబంధించిన రహస్యాలను దుర్వినియోగం చూస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందంటూ కాగ్నిజెంట్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇన్ఫోసిస్ తోసిపుచ్చింది. తమ పరువును దెబ్బతీసేందుకే కాగ్నిజెంట్ ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతుందంటూ ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది.