ఒక్కో షేరుపై 21 డివిడెండ్
ముంబై : ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ గురువారం త్రైమాసిక ఫలితాలను ప్రక టించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.6,506 కోట్ల నిక ర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,212 కోట్లతో పోలి స్తే 4.7 శాతం వృద్ధి చెందింది.
అదే సమయంలో కంపెనీ ఆదాయం 4.2 శాతం పెరిగి రూ.40,986 కోట్లకు చేరిందని కంపె నీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 3.7- 4.5శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది.
మునుపటి త్రైమాసికంలో ఈ అంచనాలు 3- 4 శాతంగా పేర్కొంది. మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. అర్హులైన షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.21 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. దీని రికార్డు తేదీ అక్టోబర్ 29గా వెల్లడించింది. నవంబర్9 నాటికి డివిడెండ్‌ను అందిస్తారు.
రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు నమోదు చేయడం పట్ల కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో 2.4 బిలియన్ డాలర్ల డీల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.84శాతం పెరిగి రూ.1974 వద్ద ముగిసింది.