రెవిన్యూ గైడెన్స్ పెంపు
న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో రెండో పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్ మెరుగైన క్యూ3 ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2024 అక్టోబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికరలాభం 11.5 శాతం వృద్ధితో రూ. 6,806 కోట్లకు చేరింది. గత క్యూ3లో కంపెనీ రూ.6106 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇన్ఫోసిస్ కార్యకలాపాల ఆదాయం 7.58 శాతం పెరిగి రూ. 38.821 కోట్ల నుంచి రూ. 41,764 కోట్లకు చేరింది. ఫైనాన్షియల్, తయారీ రంగాల నుంచి అధిక ఆదాయం ఆర్జించవచ్చన్న అంచనాలతో ప్రస్తుత 30242 సంవత్సరానికి రెవిన్యూ గైడెన్స్‌ను ఇన్ఫోసిస్ పెంచింది.
ఫైనాన్షియల్ సర్వీసుల నుంచి 27.5 శాతం, తయారీ నుంచి 15.5 శాతం ఆదాయం వస్తుందన్న అంచనాల్ని ప్రకటించింది. ఆ తదుపరి అధిక ఆదాయం రిటైల్, ఎనర్జీ రంగాల నుంచి సమకూరుతుందని తెలిపింది. 2024 రెవిన్యూ గైడెన్స్‌ను 3.75 శాతం నుంచి 4.5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. అయితే 20 శాతం ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్‌ను మార్పు చేయలేదు.
ఇండియా ఆదాయంలో వృద్ధి
భౌగోళిక ప్రాంతాలవారీగా చూస్తే ఇండియా, యూరప్‌ల ఆదాయం పెరిగిందని, ఉత్తర అమెరికా ఆదాయం 5 శాతం వృద్ధిచెందిందని ఇన్ఫోసిస్ తెలిపింది.
మా డిజిటల్ ఆఫరింగ్స్, కీలక చర్యల ద్వారా సీజనల్‌గా బలహీనమైన క్వార్టర్లోనూ వృద్ధి సాధిం చాం. యూఎస్‌లో డిస్క్రీషనరీ పరిశ్రమ ఒత్తిడి తొలగిపోతున్నది. వినిమయ ఉత్పత్తుల పరిశ్రమలో మెరుగుదలను గమనిస్తున్నాం. ఏఐ సామర్థ్యాలను, ప్రత్యేకించి క్లయింట్లు కోరుకుంటున్న జనరేటివ్ ఏఐ సామర్థ్యాలను పటిష్టపరుస్తున్నాం.
పరేఖ్ సీఈవో, ఇన్ఫోసిస్
5,591 మంది కొత్త ఉద్యోగులు జత
క్యూ3లో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్యను పెంచిం ది. కొత్తగా 5,591 మందిని తీసుకోవడంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,379కి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 15,000 ఉద్యోగులను నియమిస్తామని ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేశ్ తెలిపారు. వచ్చే 205 20,000కుపైగా కొత్త నియామకాలు ఉంటాయన్నారు.
అమెరికాలో కొత్త అధికార యంత్రాంగంపై స్పందిస్తూ హెచ్1బీ వీసాలపై ఇన్ఫీ ఆధారపడటం తగ్గిందని, ఆన్‌సైట్ వర్క్ 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించామని, నియర్‌షోర్ సర్వీసులు పెంచామని వివరించారు.