షోకాజ్ నోటీసు జారీ చేసిన కౌన్సిల్
న్యూఢిల్లీ, జూలై 31: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ భారీ స్థాయిలో జీఎస్టీని ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తున్నది. రూ.32,403 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ముందస్తు షో-కాజ్ నోటీసు జారీ అయినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. జూలై 2017 నుంచి మార్చి 2022 వరకు రూ.32 వేల కోట్ల జీఎస్టీ చెల్లింపులు జరుపలేదని కర్ణాటక స్టేట్ జీఎస్టీ ఆథార్టీ ఈ నోటీసును జారీ చేసినట్లు సంస్థ వెల్లడించింది. కంపెనీకి సంబంధించి విదేశీ కార్యాలయాలు పెట్టే ఖర్చులపై జీఎస్టీ చెల్లించలేకపోవడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిటెన్స్ ఈ ముందస్తు షోకాజ్ నోటీసును జారీ చేశారు.