calender_icon.png 23 December, 2024 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం కోరే సమాచారం, రిపోర్ట్లను సకాలంలో అందజేయాలి

07-10-2024 12:55:13 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి) : ప్రభుత్వం కోరుతున్న సమాచారాన్ని, రిపోర్టులను ఎలాంటి జాప్యం చేయకుండా సకాలంలో అందజేయాలని కొత్తగూడెం మండల విద్యాధికారి ఎం ప్రభుదయాల్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఎమ్మార్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాఠశాలల సమాచారంపై కేంద్రీకరించిన ప్రభుత్వం ఏ సమాచారం అడిగినా ఎలాంటి జాప్యం చేయకుండా అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ ఏ అంశాలు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. డీఎస్సీ ద్వారా కొత్తగా విధుల్లోకి చేరుతున్న ఉపాధ్యాయులకు అవసరమైన దస్త్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సి సి ఓ, పిఆర్పీలు, ఎం సి ఓ, ఎంఐఎస్ కోఆర్డినేటర్, క్లస్టర్ నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.