calender_icon.png 17 October, 2024 | 3:31 PM

సమాచార చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిది

17-10-2024 01:38:31 PM

అధికారులు ఏ సమాచారాన్ని అయినా విధిగా ప్రజలకు ఇవ్వాల్సిందే

సమాచార కమిషనర్లను వెంటనే నియమించాలి

హుజురాబాద్, (విజయక్రాంతి): సమాచార చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిదని యునైటెడ్ ఫోరం ఫర్ పర్ ఆర్టీఐ తెలంగాణ  కంపియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామి రెడ్డి అన్నారు. గురువారం యునైటెడ్ ఫోరం ఫర్ పర్ ఆర్టీఐ తెలంగాణ కంపియన్  ఆధ్వర్యంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో సద్వినియం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఏ విభాగంలోనైనా అన్యాయం జరిగితే దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ పొందే వీలు ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరణ అడిగినప్పుడు అధికారులు స్పందించి వెంటనే దానికి సంబంధించిన వివరణ పత్రాలు విధిగా అందించాలన్నారు.

సమాచార హక్కు చట్టం కింద అధికారులు వివరణ ఇవ్వకపోతే వారిపై చట్టపరమైన చర్యలకు కూడా వెళ్ళవచ్చు అన్నారు.  గత పాలనలో సమాచార కమిషనర్లను నియమించలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార కమిషనర్లను వెంటనే నియమించాలని అన్నారు. కొన్ని వేల సంఖ్యలో సమాచార హక్కు చట్టం కింద వేసిన దరఖాస్తులు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలంటే సమాచార కమిషనర్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా గతంలో మాదిరిగానే పదవ తరగతి సమాచార హక్కు చట్టం పాఠ్యాంశాన్ని తిరిగి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో యునైటెడ్ ఫోరం ఫర్ పర్ ఆర్టీఐ తెలంగాణ  కంపియన్  కమిటీ సభ్యులు సిహెచ్ జనార్ధన్, బండి లక్ష్మ రెడ్డి, నలుగురు మొగిలయ్య పోలేపాక విల్సన్, కంకణాల జనార్ధన్, తులసి లక్ష్మీమూర్తి, ఇల్లందుల సమ్మయ్య, వెంకన్న, శ్రీకాంత్ రాజేశం, స్వామి తదితరులు పాల్గొన్నారు.