calender_icon.png 15 March, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పదవిని ప్రభావితం

15-03-2025 12:57:01 AM

  • చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది

జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం అనైతిక చర్య.

జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్

వనపర్తి, మార్చి 14 ( విజయక్రాంతి ) :  ప్రజాస్వామ్యంలో ప్రజల తరుపున ప్రశ్నిస్తున్న బి.ఆర్.ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్  చేయడాన్ని నిరసిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యములో  జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో  ప్రభుత్వ ఒంటికాలు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ పంటలు ఎండిపోతున్నాయి పాలన పక్కదారి పడుతుంది సమయం ఇవ్వాలని కోరితే సస్పెండ్ చేయడాన్ని నిరసించారు.

ప్రజలకిచ్చిన  వాగ్దానాలు రైతు భరోసా, రైతు భీమా,రైతు రుణ మాఫీ,మహిళకు 2500,నిరుద్యోగ భృతి,కె.సి.ఆర్ కిట్టు,కళ్యాణ లక్ష్మి తోలం బంగారం తదితర అంశాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే తట్టుకోలేక అసభ్య పదజాలం మాట్లాడారని,దళిత స్పీకర్ ని అవమాన పరిచారని ఆరోపిస్తూ అసెంబ్లీ వాయిదా వేసి కుట్ర పూర్తిగా సస్పెండ్ చేయాడాని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.