కొత్త రికార్డు స్థాయికి ఫారెక్స్
ముంబై, జూలై 19 : భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వరు సగా రెండోవారంలోనూ భారీగా పెరిగి సరికొత్త రికార్డుస్థాయికి చేరాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలై 12 తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు ఒక్కసారిగా 9.70 బిలియన్ డాలర్లు పెరిగి 666.854 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంతటి గరిష్ఠస్థాయికి ఫారెక్స్ రిజర్వులు చేరడం ఇదే ప్రధమం. అంతక్రితం జూలై5తో ముగిసిన వారంలో సైతం ఇవి 5.158 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. జూలై 12తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 8,361 బిలియన్ డాలర్లు పెరిగి 585.47 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.