22-11-2024 12:00:00 AM
‘తిలకాష్ట మహిషబంధం’ లాగా మన ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది. దేశంలో పేదరికం తగ్గినట్లుగా చూపిస్తున్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. సామాన్య మానవుడు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అంగట్లో అన్ని వస్తు వులు ముఖ్యంగా సామాన్య మానవులు తినే కూరగాయలు, పప్పులు, ఉప్పులు కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి.
దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి ఆర్థిక వ్యవస్థగా ప్రచారం చేస్తున్న నేటి పాలకులు సామాన్య మానవుని ఆర్థిక కొనుగోలు శక్తిని అంచనా వేయలేకపో తున్నారా? గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివసించే సామాజిక వ్యవస్థలో అనేక తేడాలు కనబడతాయి. ఈ వ్యత్యాసాన్ని అంచనా వేయడంలో పాలకులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది.
పెరుగుతున్న ఆహార ఉత్పత్తుల ధర లు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నా యి. ఈ ఏడాది జూలైలో తగ్గినట్టే తగ్గి మళ్లీ వరుసగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో అక్టోబ ర్‌లో వినియోగదారుల ఆహార ధరల సూచీ( సీఎఫ్‌పీఐ) ఒక్కసారిగా 10.87 శాతానికి చేరింది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 9.24 శాతంగా ఉండగా, గత ఏడాది అక్టోబర్లో 6.61 శాతం గానే ఉన్న ది. దీనికి తగ్గట్టే సీపీఐలోను పెరుగుదల చోటు చేసుకుంటుంది.
గ్రామాల్లోనే ఎక్కువ ప్రభావం
ఇక నగర పట్టణ ప్రాంతాలలో పోలిస్తే గ్రామాల్లోనే ద్రవ్యోల్బణం సెగ ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. గత నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణ రేటు 6.68 శాతంగా, పట్టణ ద్రవ్యోల్బణం రేటు 5.62 శాతంగా నమోదయినాయి.
అక్టోబరులో అధిక ఆహార ద్రవ్యోల్బ ణం ప్రధానంగా కూరగాయలు, పండ్లు , నూనెలు, కొవ్వుల ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ఉందని నేషనల్ స్టాటిస్టిక ల్ ఆఫీస్ తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయిని తాకింది. జాతీ య గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్ ఈ) విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతంగా నమోదైంది.
నిరుడు అక్టోబర్‌లో 6.83 శాతంగా ఉండగా. తర్వాత మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లో గణాంకాలు ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీ ఐ) పెట్టుకున్న పరిమితి (6శాతం)నీ తాజా గణాంకాలు దాటేశాయి. నిజానికి గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆర్బీఐ నిర్దేశించుకున్న శాతంలోపే ద్రవ్యోల్బణం గణాంకాలు నమో దయ్యాయి.
కానీ గత నెల మాత్రం హద్దు చెరిగిపోయింది.అక్టోబర్‌లో కూరగాయలు, పండ్లు, వంట నూనెలు, ఇతర కొవ్వు పదార్థాల ధరలు బాగా పెరిగినట్లు గణాంకాల్లో తేటతెల్లమైంది.్ట అంతకుముందు 3 నెలల నుంచే ఈ సెగ కనిపిస్తున్నా సంబంధిత ప్రభుత్వ వర్గాల చర్యల లేమితో తీవ్రత పెరుగు తూ పోయింది. ప్రస్తుతం కిలో కూరగాయల ధర రకాన్నిబట్టి రూ.60-80 పలు కుతున్నది. పండ్ల ధరలూ పెరిగాయి.
ధరల నియంత్రణ తప్పనిసరి
పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి. ఏడాది జూలైలో తగ్గినట్టే తగ్గి మళ్లీ వరుసగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూ పోయింది. ఏది ఏమైనా దేశంలో పేదరికంలో మగ్గుతున్న సామాన్య మానవులు అవసర వస్తువులు కొనుగోలు చేసే శక్తి ఉండాలంటే ధరల నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
మార్కెట్లో కృత్రి మ కొరత సృష్టించి సామాన్యులపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతున్న పెట్టుబ డిదారీ వ్యవస్థపై ఒక కన్నేసి ఉంచి. కృత్రి మ కొరతకు పాల్పడే వ్యక్తులపై కేసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి