ఆగస్టులో 3.65 శాతం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలోనూ రిజర్వ్‌బ్యాంక్ లక్ష్యం 4 శాతం దిగువనే నమోదయ్యింది. గురువారం నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో వినిమయ ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా ఉన్నది. అయితే ఈ ఏడాది జూలై నెలలో నమోదైన 3.6 శాతంకంటే ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. 2023 ఆగస్టులో ఇది 6.83 శాతం. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు అదుపు చేయా లంటూ ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం ఇంకా 5 శాతం ఎగువనే కొనసాగుతున్నది. ఈ ఆగస్టు నెలలో ఆహారోత్పత్తుల రిటైల్ ద్రవ్యోల్బణం 5.66 శాతానికి చేరింది.