హైదరాబాద్: ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ బేగంపేట్‌లో ఘనంగా ప్రారంభమైంది. గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పారా అథ్లెట్లను గవర్నర్ ప్రత్యేకంగా సన్మానించారు.
పారా అథ్లెట్లకు ప్రోత్సాహం అందించేందుకు ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ ఎంతగానో ఉపయోగపడనుందని గవర్నర్ తెలిపారు. కార్యక్రమంలో ఐఏఎస్ జయేశ్ రంజన్, ఆదిత్య మెహతా పౌండేషన్ ట్రస్టీ అండ్ ఎలికో వైస్ చైర్మన్ వనిత దట్ల తదితరులు పాల్గొన్నారు.