calender_icon.png 6 April, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇనిఫినిటీ లెర్న్ ఆత్రేయ ప్రారంభం

06-04-2025 12:23:37 AM

శ్రీ చైతన్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దేశంలోనే ఫలితాల ఆధారిత అభ్యాసాన్ని పెద్దఎత్తున అందిస్తున్న ఏకైక హైబ్రిడ్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ ఇన్ఫినిటీ లెర్న్. శ్రీ చైతన్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక నీట్ కోర్సు ‘ఆత్రేయ’ను శనివారం ప్రారంభించారు. నీట్ అభ్యర్థులకు ఎక్కువగా సవాలు గా నిలిచేది ఫిజిక్స్. దీనిపై ప్రత్యేకంగా ఆత్రేయ దృష్టి పెడుతుంది.

ఈ కోర్సులోని ప్రత్యేకత ఏమిటంటే పీ2సీబీజెడ్ ద్వారా ఫిజిక్స్ సెషన్లను రెట్టింపు చేస్తుంది. శ్రీ చైతన్య అకాడమీ సుస్థిర బోధనా విధానంతో రూపొందించిన ఆత్రే య 11వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దబడింది. ఇందులో అత్యుత్త మ నీట్ ఫ్యాకల్టీ గైడ్ చేయడం ద్వారా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించే అవకా శాలు మెరుగవుతాయి.

ఈ కోర్సులో ప్రత్యేక ఆకర్షణ పీ2సీబీజెడ్ ఫీచర్ ద్వారా ప్రతి రోజు ఫిజిక్స్, కెమెస్ట్రీ, బోటనీ, జువాలజీలకు ఒక్కో దానికి ఒక గంట 15 నిమిషాల పాటు నాలుగు క్లాసులు ఉంటాయి. అదనంగా ఫిజిక్స్ ప్రాక్టీస్‌కోసం ప్రత్యేకంగా ఒక గంట సెషన్ ఉంటుంది. ఈ సందర్భంగా ఇన్ఫినిటీ లెర్న్ సహ వ్యవస్థాపకురాలు, శ్రీ చైతన్య గ్రూప్ సీఈఓ, డైరెక్టర్ శ్రీమతి సుష్మ బొప్పన మాట్లాడుతూ.. ఆత్రేయ ద్వారా నీటి కోచింగ్‌ను కొత్త దిశలో తీసుకెళ్లామన్నారు.

ఆధునిక ఏఐ టెక్నాలజీని మిళితం చేయడం ద్వారా విద్యార్థుల అభ్యాసాన్ని విప్లవాత్మకంగా మార్చుతున్నాన్నారు. ఇన్ఫినిటీ లెర్న్ (శ్రీ చైతన్య) వ్యవస్థాపక సీఈఓ ఉజ్జ్వల్ సింగ్ మాట్లాడుతూ.. టాప్ కాలేజీల్లో అడ్మిషన్లలో సాధించడమే తమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రతి అభ్యర్థిని శక్తివంతం చేయడమే తమ మిషన్ అన్నారు.