calender_icon.png 15 November, 2024 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యాలో సంతానలేమి

11-09-2024 12:02:58 AM

అత్యల్ప జనన రేటు 

యుద్ధమే కారణమని విశ్లేషకుల అంచనా

మాస్కో, సెప్టెంబర్ 10: ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఇప్పటికే అనేక మంది సైనికులను కోల్పోయిన రష్యాకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. కొన్నాళ్లుగా ఆ దేశంలో జనన  మరణాల్లో అంతరం భారీగా పెరుగుతున్నట్లు తాజాగా అక్కడి అధికారులు విడుదల చేసిన డాటా ద్వారా తెలుస్తోంది. గణాంకాల ప్రకారం రష్యాలో ఈ ఏడాది జూన్ వరకు 5,99,600 మంది పిల్లలు పుట్టారు. 2023, జూన్ నాటితో పోలిస్తే దాదాపు ఇది 16,000 తక్కువ. నవజాత శిశువుల సంఖ్య 6 శాతం తగ్గినట్లు ఇటీవల అక్కడి స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.  ఇటీవల రష్యా దిగువ సభలో కుటుంబాల రక్షణ కమిటీ అధిపతి నినా ఒస్టానినా జననాల రేటు తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేశారు.

రష్యాలో జనాభా తగ్గుదలతో 2022లో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు మిలియన్ రూబెల్స్ (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలు), మదర్ హీరోయిన్ అవార్డు ఇస్తామని ప్రకటించారు. 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజు ఈ నగదు అందజేస్తామని, అప్పటికీ మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని నిబంధన విధించారు. కానీ అక్కడి జనాభాలో పెరుగుదల కనిపించలేదు.