calender_icon.png 28 September, 2024 | 6:56 AM

నాసిరకంగా పారాసిటమాల్

27-09-2024 12:44:16 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: కొద్దిగా జ్వరం వచ్చినట్లు అనిపించినా, శరీర ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే వేసుకునే ట్యాబ్‌లెట్ పారాసిటమాల్. కానీ, ఆ పారాసిటమాల్‌తో పాటు మరో 53 ఔషధాలను నాసిరకమని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) ప్రకటించింది. పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సీ, డీ3, బీ కాంప్లెక్స్ వంటి 53 ఔషధాల నాణ్యత ప్రమాణాల మేరకు లేదని తేల్చింది. ఆగస్టులో నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ విఫలమైనట్లు వెల్లడించింది. యాంటీబయాటిక్స్, రక్తపోటు, విటమిన్ మాత్రల్లోనూ నాణ్యత లోపిం చిందని తెలిపింది. రాష్ట్రాల్లో డ్రగ్ అధికారులు ఆయా విభాగాల ఔషధాలను పరీక్షించి ఈ మేరకు నిర్ధా రించారు.