05-03-2025 01:14:54 AM
బీజేపీ నేత ఉపేందర్‌రెడ్డి ఆరోపణలు
కూసుమంచి , మార్చి 4 (విజయ క్రాంతి):ఏమాత్రం నాణ్యత లేకుండా కల్వర్టు ,మోరీల నిర్మాణం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారనీ మండల బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు . కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో తురక గూడెం - కిష్టాపురం లింక్ రోడ్ పనులు జరుగుతున్నాయి.. తొలుత మొరీల ,కల్వర్టు నిర్మాణాలు చేపట్టారు.. అయితే కల్వర్టు ,మోరీలకు ఉపయోగిస్తున్న ఇసుక మట్టితో ఉండి మొరం తీరుగా ఉన్న అదే ఇసుకను నిర్మాణంలో వాడుతున్నారని బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి ఆరోపించారు.. మంగళవారం నిర్మాణపు పనులు జరుగుతున్న ప్రదేశాన్ని బీజేపీ బృందం పరిశీలించారు.
గతంలో మండలంలో జరిగిన సీసీ రోడ్ల నిర్మాణంలో కూడా నాశిరకపు ఇసుకను ఉపయోగించారని పిర్యాదులు ఇచ్చినా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.. కనీసం పనులు జరిగే సమయంలో నాణ్యతను పరిశీలించాల్సి ఉన్న అటు వైపు చూసినా పాపాన పోలేదన్నారు.. ఇకనైనా అధికారులు స్పందించి గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. పనులను పరిశీలించిన వారిలో పిట్టల వేణు , గుండా విజయ పాల్ రెడ్డి , దామల్ల కోటి ఉన్నారు..