calender_icon.png 16 January, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాల్లో అనర్హులకు చోటు ఇవ్వకూడదు

16-01-2025 04:47:50 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే....

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాల సర్వేలో అన్హరులకు చోటు ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dotre) అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో చేపడుతున్న రైతు భరోసా రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సర్వే సిబ్బంది సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలు నమోదు చేయకూడదన్నారు. వివిధ పనులపై ప్రభుత్వము చేపట్టిన భూసేకరణ కింద తీసుకున్న భూములకు రైతు భరోసా ఇవ్వకూడదన్నారు. రాళ్లు, గుట్టలు గల భూములను పరిశీలించాలని సూచించారు. రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు నమోదు చేయాలని తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లో అన్హరులకు ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని వ్యవసాయ కూలీలు నిరుపేదలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు పనిచేసిన కుటుంబాలను గుర్తించి జాబితాను రూపొందించి గ్రామ సభలలో ప్రవేశపెట్టాలన్నారు. నిర్ణయిత గడువులోగా సర్వేను పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సందీప్ నగర్ లో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ రోహిత్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు సర్వే సిబ్బంది పాల్గొన్నారు.