calender_icon.png 10 March, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నడ చిత్రసీమకు పరిశ్రమ హోదా

08-03-2025 12:00:00 AM

కన్నడ సినిమా ఇండస్ట్రీకి పరిశ్రమ హోదా కల్పిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పారిశ్రామిక విధానం కింద సౌకర్యాల ను చిత్రసీమకు విస్తరింపజేస్తామని తెలిపారు. శుక్రవారం  జరిగిన కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా సినీ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సిద్ధరామయ్య సర్కా రు సభ ముందుకు తెచ్చింది.

ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూరులో ఒక ఫిల్మ్‌సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. దీని నిర్మాణా నికి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించనున్నట్టు తెలి పారు.

కన్నడ సినిమాను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నటిచేలా ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు. సినిమా టికెట్ ధరలను రూ.200గా నిర్ణయించాలనుకున్నట్టు చెప్పారు.

మల్టీఫ్లెక్స్‌లు సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకూ ఇదే రేటు ఉంటుందని తెలిపారు. సామాన్యులకూ సినిమాను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సీఎం వెల్లడించారు.