calender_icon.png 11 April, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంలో అత్యాధునిక ఫుడ్ సైన్స్, టెక్నాలజీ ల్యాబ్‌లను ప్రారంభించిన పరిశ్రమ నిపుణులు

04-04-2025 06:46:15 PM

పటాన్ చెరు: విద్యా నైపుణ్యం, పరిశ్రమ-ఆధారిత అభ్యాసం వైపు గణనీయమైన పురోగతిలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండు అత్యాధునిక ప్రయోగశాలలను (ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్, ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ అండ్ సెన్సరీ ఎవాల్యుయేషన్ ల్యాబ్) నెలకొల్పింది. వాటిని ప్రముఖ పరిశ్రమ నిపుణులు- ప్రియా ఫుడ్స్ పరిశోధన-అభివృద్ధి విభాగం (ఎన్ పీడీ) డిప్యూటీ జనరల్ మేనేజర్ నిరుపమ ఎస్.దేశికన్, దొడ్లా డైరీలో నాణ్యతా విభాగాధిపతి మోహన్ కుమార్ రేటూరి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ అత్యాధునిక సౌకర్యాలు యూజీ, పీజీ విద్యార్థులను ఆహార పరిశ్రమలో విజయానికి కీలకమైన ఆచరణాత్మక నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

తద్వారా వారు సమగ్ర ఉత్పత్తి పరీక్ష, ఆచరణాత్మక ప్రయోగాలు, వినూత్న పరిశోధనలను నిర్వహించగలుగుతారు. ఈ వినూత్న ప్రయోగశాలలు ఆవిష్కరణ, పరిశోధన, నైపుణ్య అభివృద్ధికి కేంద్రాలుగా పనిచేయడంతో పాటు విద్యార్థులకు ఆహార విశ్లేషణ, ఉత్పతి అభివృద్ధి, మూల్యాంకనంలో ఆచరణాత్మక శిక్షణ అందించనున్నాయి. ఈ ప్రారంభోత్సవంలో  గౌరవ అతిథులు  ప్రసంగించారు. ఆహార నాణ్యత, భద్రత, ఉత్పత్తి అభివృద్ధితో సహా కీలకమైన పరిశ్రమ అంశాలపై లోతైన అవగాహనను కల్పించారు. ఆహార శాస్త్రం, సాంకేతిక రంగ ధోరణులు, పరిశ్రమ సవాళ్లు, అవకాశాలపై విద్యార్థులకు వారు మార్గనిర్ధేశనం చేయడమే గాక, అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలపై విలువైన దృక్పథాలను వివరించారు.

ఫుడ్ సైన్స్ కోర్సు సమన్వయకర్త డాక్టర్ జి.నిహారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశోధనను ప్రోత్సహించడానికి, కొత్త ఆహార ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, వ్యవస్థాపక అవకాశాలను అన్వేషించడానికి, విద్యా, వృత్తిపరమైన వృద్ధిని మరింత మెరుగుపరచడానికి ఈ అత్యాధునిక ల్యాబ్ లను పూర్తిగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆహార రంగంలో రాణించాలని అభిలషించే వారికి గీతం మంచి వేదికన్నారు. ఆహార పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న కెరీర్ కు అవసరమైన జ్జానం, నైపుణ్యాలతో భవిష్యత్ నిపుణులను సన్నద్ధం చేయాలనే గీతం నిబద్ధత, చొరవకు ఈ అత్యాధునిక ల్యాబ్ లే నిదర్శనమని డాక్టర్ నిహారిక పేర్కొన్నారు.  స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ సదస్సు

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ  హైదరాబాదులో ఏప్రిల్ 3, 4 తేదీలలో పర్యావరణ హిత కృత్రిమ మేధస్సు, పరిశ్రమలలో వినియోగం (గ్రీన్ ఏఐ-2025) పేరిట నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు ఏఐ రంగంలో జ్జాన మార్పిడి, ఆవిష్కరణ, సహకారం కోసం ఒక వేదికగా తోడ్పడింది. ఈ సదస్సు ఏఐ జనరేటెడ్ మోడల్స్, ఆటోమేటెడ్ లెటర్ జనరేషన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లపై దృష్టి సారించే ముందస్తు కార్యశాలలతో ప్రారంభమైనట్టు సదస్సు నిర్వహకురాలు డాక్టర్ నందిత భంజ చౌధురి వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, వెరిజోన్ డేటా సర్వీసెస్ తో సహా ప్రముఖ సంస్థల నుంచి అనేక మంది ప్రముఖ వక్తలు ఆరోగ్య సంరక్షణ, గేమింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్, అంతకు మించి ఏఐ-ఆధారిత ఆవిష్కరణపై సదస్యులకు లోతైన అవగాహన కల్పించినట్టు ఆమె తెలిపారు.

గత రెండు రోజులుగా ఈ సదస్సులో పాల్గొన్నవారు అంతర్దృష్టి చర్చలతో పాటు తమ ఆలోచనలను ఇతరులతో పంచుకున్నట్టు చెప్పారు. మేధోపరమైన చర్చ, మార్గదర్శక పురోగతుల కేంద్రంగా ఈ సదస్సు నిరూపితమైందన్నారు. ఏఐ, దాని వినియోగిస్తున్న నిపుణులు కొంతమందిని ఒకచోట చేర్చినట్టు తెలిపారు. వారందరికీ  డాక్టర్ నందిత హృదయ పూర్వక కృతజ్జతలను తెలియజేశారు. చివరగా, ఈ సదస్సులో స్వయంగా పత్ర సమర్పణ చేసిన వారికి ప్రశంసా పత్రాలను సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగాధిపతి ప్రొఫెసర్ శిరీష, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా ప్రదానం చేశారు.