30-04-2025 12:48:02 AM
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడిం చారు. వీటిల్లో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను ఏ ర్పాటు చేసేలా తెలంగాణ యువతను ప్రోత్సహిస్తామన్నారు.
రూ. 44.3 కోట్లతో టీజీఐఐసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఎనకవత గ్రామం లో ‘మొబిలిటీ వ్యాలీ పార్క్’ను అభివృద్ధి చేయడానికి శ్రీధర్‌బాబు మం గళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 862 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పార్క్ ద్వారా దాదాపు 10 వేలమంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
పరిశ్రమలు కేవ లం హైదరాబాద్‌కే పరిమితం కా కుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల ను మరింత బలోపేతం చేసేందుకే ప్రత్యేక పాలసీని తీసుకొచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తుంటే కొందరు కావాలనే పనికట్టుకుని ప్రభుత్వంపై దు ష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే త ప్పుడు ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఈ కా ర్యక్రమంలో స్పీకర్ గడ్డంప్రసాద్‌కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మ లా జగ్గారెడ్డి పాల్గొన్నారు.